Telugu Global
NEWS

ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఆర్థిక శాఖ ఖండించింది. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. నిధుల కొరత ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ‘సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ (ఈ-కుబేర్‌ పద్ధతిలో వేతనాలు రిజర్వ్‌ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అదే […]

ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ
X

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఆర్థిక శాఖ ఖండించింది. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.

నిధుల కొరత ఏమాత్రం లేదని స్పష్టం చేసింది.

‘సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ (ఈ-కుబేర్‌ పద్ధతిలో వేతనాలు రిజర్వ్‌ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అదే ప్రకారం అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా జులై 31నే ఆర్‌బీఐకి పంపడం జరిగింది. 1వ తేదీ మధ్యాహ్నంకు పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించాం. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన ఫైళ్ల చెల్లింపు ఆలస్యం అయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాలు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు.

ఆర్‌బీఐలో ఏర్పడిన చిన్న సంకేతిక కారణాల వల్లే ఆలస్యం అయిందని… అందరి జీతాలు బ్యాంకులో ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ట్వీట్ చేశారు.

First Published:  2 Aug 2019 12:21 AM GMT
Next Story