హిట్టుకోసం…. రాహుల్ విజయ్ పాట్లు !

హీరో రాహుల్ విజయ్ తెలుగు లో చేసింది రెండు సినిమాలే…. కానీ అనుకున్నంత విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడి గా ఇండస్ట్రీ లో కి పరిచయం అయినా రాహుల్ మొదటి సినిమా మాములు గా నే నడిచింది.

ఆ తర్వాత నిహారిక కొణిదెల తో సూర్యకాంతం అనే సినిమా చేసాడు. ఈ సినిమాతో కూడా పెద్ద గా పేరు రాలేదు. అయితే ఈ సారి మాత్రం ఒక బోల్డ్ సినిమా తో రాహుల్ ప్రేక్షకుల ముందు కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా ఆశించిన స్థాయి లో విజయం పాధింయాలనే ప్రయత్నం చేస్తున్నాడు రాహుక్. అయితే ఈ సినిమా కి ఒక కొత్త వ్యక్తి దర్శకత్వం చేయబోతున్నాడు.

ఒక కాలేజ్ డ్రామా గా ఈ సినిమా రానుందట. ఈ సినిమా కథ ని కొన్ని వాస్తవ సంఘటనల ద్వారా రాయబడిందని తెలుస్తోంది. అయితే విజయవాడ లోని సిద్దార్థ కాలేజ్ లో 2006 లో జరిగిన ఘటనల ఆధారం గా ఈ సినిమా తీయబడుతుంది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా లో రాహుల్ ఒక న్యూడ్ సీన్ లో నటించనున్నాడట. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ కానుంది అని తెలుస్తోంది.