డైరెక్టర్ పుట్టినరోజు…. ‘వెంకీ మామ’ స్పెషల్ వీడియో

గతంలో నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమా లో విక్టరీ వెంకటేష్ గెస్ట్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు వెంకీ, చై కలిసి హీరోలుగా నటిస్తున్న ఒక మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతోంది. ‘వెంకీ మామా’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాశిఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు బాబీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి ఒక మేకింగ్ వీడియోని విడుదల చేశారు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మానిటర్ చూస్తూ కె ఎస్ రవీంద్ర యాక్షన్ అని చెప్పడం తో మొదలయ్యే ఈ వీడియో లో వెంకటేష్ , నాగ చైతన్య సరి కొత్త లుక్ లో కనిపిస్తారు. ఇద్దరూ కలిసి నడిచి వచ్చే సీన్ సినిమాకి హైలైట్ అని ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా…. ఈ ఏడాది ఆఖరులో విడుదల కాబోతోంది. చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.