జూదంలో భార్య‌ను ఓడి…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జాన్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఈ ఉదంతం జ‌నాన్ని విస్మ‌యానికి గురిచేస్తున్న‌ది. ఓ పురుష పుంగ‌వునికి తాగుడు, జూదం త‌ప్ప వేరే ప్ర‌పంచ‌మే తెలియ‌దు. ఒక రోజు అత‌డి ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా జూదంలో పోయింది. దీంతో త‌న భార్య‌ను పందెంగా పెట్టి జూద‌మాడి ఓడిపోయాడు. ఓడిన త‌ర్వాత త‌న భార్య‌ను ఏమైనా చేసుకోమ‌ని గెలిచిన‌వారితో చెప్పాడు. ఇంకేముంది వాళ్ళు ఆమె మీదకు ఎగ‌బ‌డ్డారు.

ఆమె త‌ప్పించుకుని పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ళి జ‌రిగిన సంగ‌తి చెప్పింది. కానీ పోలీసులు మాత్రం ప‌ట్టించుకోలేదు. చేసేది లేక ఆమె కోర్టును ఆశ్ర‌యించింది. అప్పుడు కానీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్‌ న‌మోదు చేయ‌లేదు.

భ‌ర్త స్నేహితుడు అరుణ్‌, స్వ‌యంగా బంధువైన అనిల్ త‌ర‌చుగా త‌న భ‌ర్త‌తో జూదం ఆడ‌టానికి, మ‌ద్యం తాగ‌టానికి త‌మ ఇంటికి వ‌స్తూ ఉంటారని, వాళ్ల‌తో జూదం ఆడి ఓడిన త‌న భ‌ర్త వాళ్ల‌ను న‌న్ను రేప్ చేయ‌డానికి అనుమ‌తించాడ‌ని ఆమె బోరుమ‌న్న‌ది.

భ‌ర్త‌తో ఇక ఎంత మాత్రం కాపురం చేయ‌న‌ని చెప్పి ఆమె త‌న మేన‌మామ‌ ఊరెళ్లింద‌ట‌. ఆమెను అనుస‌రిస్తూ అక్క‌డికి వెళ్ళిన భ‌ర్త తాను చేసింది త‌ప్పేన‌ని, క్ష‌మించ‌మ‌ని వేడుకున్నాడు. క‌రిగి పోయిన భార్య త‌న భ‌ర్త వ‌చ్చిన కారెక్కి తిరుగు ప్ర‌యాణం అయింది.

అయితే దారి మ‌ధ్య‌లో కారు ఆపిన ఆమె భ‌ర్త‌…. త‌న జూదం మిత్రుల‌ను రేప్ చెయ్య‌మ‌ని ఆమెపైకి ఎగ‌దోలాడ‌ట‌. ఆమె ఏదోలా త‌ప్పించుకున్న‌ద‌నుకోండి. మాట త‌ప్ప‌ని ఈ ఆధునిక హ‌రిశ్చంద్రుల‌ను ఏంచేయాలంటారు? అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.