Telugu Global
National

టిక్‌టాక్‌పై వేటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

టిక్‌టాక్‌. ఈ యాప్‌ను ఫాలో అయ్యే వారు అందులో భలే మజా ఉంటుందంటారు. టిక్‌టాక్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. ఏలాగైనా సరే గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికతో మొత్తం ఫోకస్ దానిపైనే పెట్టేస్తున్నారు. ఆడవాళ్లు కూడా ఈ యాప్‌ మాయలో చిక్కుకుపోయారు. రకరకాల భావాలతో వీడియోలు చేస్తున్నారు మహిళలు. ఇక విద్యార్థులైతే చదువు సంగతి మరిచిపోయి యాప్‌లో ఇరుక్కుంటున్నారు. ఒకసారి టిక్ టాక్ లోకి ఎంటరైతే అంతే. విద్యార్థులు చాలా మంది మార్కులు తెచ్చుకోవడం ఎలా […]

టిక్‌టాక్‌పై వేటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
X

టిక్‌టాక్‌. ఈ యాప్‌ను ఫాలో అయ్యే వారు అందులో భలే మజా ఉంటుందంటారు. టిక్‌టాక్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. ఏలాగైనా సరే గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికతో మొత్తం ఫోకస్ దానిపైనే పెట్టేస్తున్నారు.

ఆడవాళ్లు కూడా ఈ యాప్‌ మాయలో చిక్కుకుపోయారు. రకరకాల భావాలతో వీడియోలు చేస్తున్నారు మహిళలు. ఇక విద్యార్థులైతే చదువు సంగతి మరిచిపోయి యాప్‌లో ఇరుక్కుంటున్నారు. ఒకసారి టిక్ టాక్ లోకి ఎంటరైతే అంతే.

విద్యార్థులు చాలా మంది మార్కులు తెచ్చుకోవడం ఎలా అన్న దానిపై కన్నా…. టిక్‌టాక్‌లో క్రేజ్ తెచ్చుకోవడం ఎలా అన్న దానిపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఈ యాప్‌ కారణంగా ఆఫీసుల్లో పని నాణ్యత దారుణంగా పడిపోతోంది. కొందరు ఆఫీసుల్లోనే వీడియోలు చేసి ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో టిక్‌టాక్‌ బానిసల వల్ల పని జరక్క… ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్ కారణంగా భారీగా మానవ వనరులు, పనిగంటలు వృథా అవుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై వేటుకు దేశంలోని ఏడు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్, పశ్చిమబెంగాల్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లు లేఖలు రాశాయి.

ఈ యాప్‌ను అడ్డుకోవాలని కోరాయి. ఈ యాప్‌ కారణంగా వ్యవస్థల పనితీరే ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ఏడు రాష్ట్రాల లేఖలకు స్పందించిన కేంద్రం… యాప్‌ నిర్వాహకులకు 24 ప్రశ్నలతో నోటీసులు పంపించింది. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని… లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

First Published:  3 Aug 2019 3:27 AM GMT
Next Story