Telugu Global
Cinema & Entertainment

మరో ప్రయోగం చేయబోతున్న విక్రమ్

ఒక సినిమాలో ఒక పాత్ర చేయాలంటే దానిని పూర్తిగా స్టడీ చేసి, వీలైనంత కొత్తగా డిఫరెంట్ గా కనిపించలనే నిత్య ప్రయత్నం లో ఉండే నటుడు విక్రమ్. చియాన్ విక్రమ్ గా మనందరికీ సుపరిచితుడైన ఈ స్టార్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం చాలా కష్టపడనున్నాడట. ఎప్పటికప్పుడు అభిమానులనే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేయాలనే ఉదేశ్యం తో పని చేసే విక్రమ్, ఈసారి ఒక ఆసక్తికర చిత్రం తో ప్రేక్షకుల ముందుకు […]

మరో ప్రయోగం చేయబోతున్న విక్రమ్
X

ఒక సినిమాలో ఒక పాత్ర చేయాలంటే దానిని పూర్తిగా స్టడీ చేసి, వీలైనంత కొత్తగా డిఫరెంట్ గా కనిపించలనే నిత్య ప్రయత్నం లో ఉండే నటుడు విక్రమ్. చియాన్ విక్రమ్ గా మనందరికీ సుపరిచితుడైన ఈ స్టార్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం చాలా కష్టపడనున్నాడట.

ఎప్పటికప్పుడు అభిమానులనే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేయాలనే ఉదేశ్యం తో పని చేసే విక్రమ్, ఈసారి ఒక ఆసక్తికర చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మురగదాస్ దగ్గర గతంలో పని చేసిన అజయ్ జ్ఞానముత్తు అనే దర్శకుడి తో విక్రమ్ తన నెక్స్ట్ ఫిలిం చేయబోతున్నాడు.

రెండున్నర గంటల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో విక్రమ్ దాదాపుగా 25 గెటప్స్ లో కనిపించి ఆడియన్స్ ని అలరించనున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల లో మొదలు పెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇటీవలే వచ్చిన మిస్టర్ కేకే సినిమా కూడా నిరుత్సాహపరచడం తో, విక్రమ్ తన తదుపరి సినిమా పై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో ఉన్నాడు. అందుకే ఈ సినిమా తో ఎలాగైనా పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడట.

First Published:  3 Aug 2019 7:00 AM GMT
Next Story