Telugu Global
International

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితాల్లో ఒక ర్యాంకు కోల్పోయిన భారత్

2024నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల (350 లక్షల కోట్లు)కు తీసుకెళ్తామని ఒకవైపు మోడీ చెబుతుంటే తాజా పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. భారత్‌లో కీలకమైన ఎనిమిది రంగాల్లో వృద్ధి మందగించింది. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ ఒక ర్యాంకును కోల్పోయింది. అదిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల జాబితాలో ఆరు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. 2018లో భారత్ జీడీపీ 2.71 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. […]

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితాల్లో ఒక ర్యాంకు కోల్పోయిన భారత్
X

2024నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల (350 లక్షల కోట్లు)కు తీసుకెళ్తామని ఒకవైపు మోడీ చెబుతుంటే తాజా పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. భారత్‌లో కీలకమైన ఎనిమిది రంగాల్లో వృద్ధి మందగించింది.

తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ ఒక ర్యాంకును కోల్పోయింది. అదిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల జాబితాలో ఆరు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. 2018లో భారత్ జీడీపీ 2.71 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా జీడీపీ 20.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. చైనా 13. 6 ట్రిలియన్ డాలర్లలో రెండో స్థానంలో ఉంది. జపాన్‌(4. 9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్( 2.77) డాలర్లతో వరసగా భారత్ కంటే ముందున్నాయి.

2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల జీడీపీని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఈ ఏడాది మూడు ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధన లక్ష్యంగా పెట్టుకుంది. గతంతో పోలిస్తే చైనా వృద్ధి రేటు కూడా మందగించింది.

First Published:  2 Aug 2019 8:25 PM GMT
Next Story