Telugu Global
Cinema & Entertainment

పరశురామ్ తో బెల్లంకొండ....

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీ కి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్ళలో ఒక్క సరైన హిట్ కూడా కొట్టలేదు… కానీ ఈ శుక్రవారం విడుదల అయిన రాక్షసుడు సినిమా తో మొదటి విజయం సాధించాడు ఈ హీరో. అయితే ఈ సినిమా తర్వాత సెలెక్టీవ్ గా… మంచి కథలు అనుకుంటేనే సినిమా చేస్తానని బెల్లంకొండ తన అభిమానులకి ప్రామిస్ చేసాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం రాక్షసుడు విజయం తో మంచి జోష్ మీద […]

పరశురామ్ తో బెల్లంకొండ....
X

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీ కి వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్ళలో ఒక్క సరైన హిట్ కూడా కొట్టలేదు… కానీ ఈ శుక్రవారం విడుదల అయిన రాక్షసుడు సినిమా తో మొదటి విజయం సాధించాడు ఈ హీరో. అయితే ఈ సినిమా తర్వాత సెలెక్టీవ్ గా… మంచి కథలు అనుకుంటేనే సినిమా చేస్తానని బెల్లంకొండ తన అభిమానులకి ప్రామిస్ చేసాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం రాక్షసుడు విజయం తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు సినిమాకి సైన్ చేసిన ఈ హీరో…. నెక్స్ట్ సినిమా పైన దృష్టి పెట్టాడు. ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా తో బెల్లంకొండ మళ్ళీ అభిమానులకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో పరశురామ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడట. ఒక మాస్ యాక్షన్ కథ తో బెల్లంకొండ రాబోతున్నాడట. ఇప్పటికే పరశురామ్ ఒక కమర్షియల్ దర్శకుడి గా అందరికీ సుపరిచితుడు. గీత గోవిందం తో పెద్ద హిట్ కూడా కొట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో బెల్లంకొండ కి కూడా విజయం ఇవ్వాలని పరశురామ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తాయట.

First Published:  4 Aug 2019 1:00 AM GMT
Next Story