Telugu Global
Cinema & Entertainment

అలాంటి పాత్రలు ఎప్పుడూ చేయను

తెలుగు హీరోయిన్ గా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన బిందు మాధవి…. ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయింది. కానీ తమిళ పరిశ్రమ లో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ భామకి. ప్రస్తుతం తమిళం లో ఒక సినిమా తో బిజీ గా ఉన్న ఆమె పై, ఆ సినిమాలో న్యూడ్ షో చేస్తుంది అనే గాసిప్స్ రావడం తో… బిందు స్పందించింది. “ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించినప్పటికీ, నేను మాత్రం […]

అలాంటి పాత్రలు ఎప్పుడూ చేయను
X

తెలుగు హీరోయిన్ గా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన బిందు మాధవి…. ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయింది. కానీ తమిళ పరిశ్రమ లో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ భామకి.

ప్రస్తుతం తమిళం లో ఒక సినిమా తో బిజీ గా ఉన్న ఆమె పై, ఆ సినిమాలో న్యూడ్ షో చేస్తుంది అనే గాసిప్స్ రావడం తో… బిందు స్పందించింది.

“ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించినప్పటికీ, నేను మాత్రం వల్గర్ గా మాత్రం ఎప్పుడూ స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకోవడం లేదు. న్యూడ్ షో చేస్తున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను అలాంటి పాత్రల్లో ఎప్పుడూ నటించను… నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఒక నటి గా నేను చాలా పాత్రలు చేయాలి. కానీ ఎప్పుడు చూసినా న్యూడ్ పాత్రల గురించే డిస్కషన్ ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కావడం లేదు” అని బిందు మాధవి కాస్త ఘాటుగా స్పందించింది.

బిందు మాధవి ప్రస్తుతం తన తదుపరి తమిళ చిత్రం కి సంబందించిన షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారట.

First Published:  4 Aug 2019 12:00 AM GMT
Next Story