Telugu Global
National

కశ్మీర్‌పై ప్రభుత్వం మరిన్ని ఆదేశాలు

ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు చేస్తారా లేక కశ్మీర్‌ను విభజిస్తారా?…. ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కశ్మీర్‌లో మాత్రం పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమర్‌నాథ్‌ యాత్రికులను, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను, క్రీడాకారులను కశ్మీర్‌ వీడి వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో భారీగా ఆర్మీని దింపింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే సమయానికి కశ్మీర్‌లో 11వేల మంది యాత్రికులు ఉండగా ఇప్పుడా […]

కశ్మీర్‌పై ప్రభుత్వం మరిన్ని ఆదేశాలు
X

ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు చేస్తారా లేక కశ్మీర్‌ను విభజిస్తారా?…. ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కశ్మీర్‌లో మాత్రం పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమర్‌నాథ్‌ యాత్రికులను, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను, క్రీడాకారులను కశ్మీర్‌ వీడి వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో భారీగా ఆర్మీని దింపింది.

ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే సమయానికి కశ్మీర్‌లో 11వేల మంది యాత్రికులు ఉండగా ఇప్పుడా సంఖ్య 1600కు పడిపోయింది. రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్లు రద్దీగా ఉన్నాయి. విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శ్రీనగర్‌ విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 6వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

పర్యాటకులను రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా ఎవరికీ గదులు ఇవ్వొద్దని హోటల్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. సరిహద్దు వెంబడి బోఫోర్స్ గన్‌లను మోహరించారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కనీసం నెల రోజులకు సరిపడ నిత్యవసర సరుకులను సిద్దం చేసుకుంటున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద జనం క్యూ కట్టారు. ఆటగాళ్లు కూడా కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో… జమ్ముకశ్మీర్ క్రికెట్ టీంకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఇర్ఫాన్ పఠాన్ సహా వంద మంది యువ క్రికెటర్లు కశ్మీర్‌ను వీడి వెళ్లిపోయారు.

First Published:  4 Aug 2019 11:03 AM GMT
Next Story