Telugu Global
Cinema & Entertainment

బన్నీ పక్కన శ్రద్ద కపూర్, కానీ....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రం పైన శ్రద్ద పెట్టాడు. సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఆల్రెడీ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా ని ఓకే చేసిన బన్నీ…. ఎవరి ప్రాజెక్ట్ ముందు మొదలు పెడతాడు? అనే విషయం మీద క్లారిటీ లేదు…. కానీ ప్రస్తుతం మాత్రం ఫిలిం నగర్ లో బన్నీ-సుకుమార్ సినిమా గురించిన […]

బన్నీ పక్కన శ్రద్ద కపూర్, కానీ....
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రం పైన శ్రద్ద పెట్టాడు. సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుంది.

ఆల్రెడీ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా ని ఓకే చేసిన బన్నీ…. ఎవరి ప్రాజెక్ట్ ముందు మొదలు పెడతాడు? అనే విషయం మీద క్లారిటీ లేదు…. కానీ ప్రస్తుతం మాత్రం ఫిలిం నగర్ లో బన్నీ-సుకుమార్ సినిమా గురించిన చర్చే ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఆసక్తికరంగా ఈ సినిమా లో శ్రద్ద కపూర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కి రష్మిక ఇప్పటికే ఎంపిక అయిపోయినప్పటికీ, శ్రద్ద కపూర్ ని మాత్రం ఒక స్పెషల్ సాంగ్ కి తీసుకోవాలని అనుకుంటున్నారట.

శ్రద్ద అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధం గా ఉన్న దర్శక నిర్మాతలు ఎలాగైనా తన ని ఈ సినిమా లో తీసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు.

కథ లో భాగం గా వచ్చే ఈ స్పెషల్ సాంగ్ చాలా కీలకం అని, అది తప్పకుండా శ్రద్ధ చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

First Published:  3 Aug 2019 11:34 PM GMT
Next Story