ఉప్పునీటి శుద్ధి కేంద్రంలో జగన్‌ ఇలా…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇజ్రాయిల్ వెళ్లినప్పటికీ అక్కడి వ్యవసాయ పద్దతులు, నీటి యాజమాన్యం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇజ్రాయిల్‌లో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధిస్తున్న పద్దతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

హడేరాలో ఏర్పాటు చేసిన ఉప్పునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా జగన్‌ సందర్శించారు. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రాజెక్టు వ్యయం, నిర్వాహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఉప్పునీటి నుంచి మార్చిన మంచి నీటిని జగన్‌ త్రాగారు. ఇజ్రాయిల్ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడ రానున్నారు.