Telugu Global
National

అమిత్ షా ధైర్యానికి హ్యాట్సాప్

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ దేశంలో పూర్తిగా విలీనం చేయడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతించారు. రాజ్యసభలో ప్రసంగించిన ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును తమ పార్టీ పూర్తిగా సమర్ధిస్తున్నట్టు చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షాకు హ్యాట్సాప్‌ చెప్పారు. ఇలాంటి ధైర్యసాహసానాలను ప్రదర్శించిన హోంమంత్రిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. తమ పార్టీ పూర్తిగా ఈ బిల్లుకు మద్దతు పలుకుతోందన్నారు. నాటి ప్రధాని నెహ్రు… నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లాబాయ్‌ పటేల్ కు ఆరోజు స్వేచ్చ ఇచ్చి […]

అమిత్ షా ధైర్యానికి హ్యాట్సాప్
X

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ దేశంలో పూర్తిగా విలీనం చేయడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతించారు. రాజ్యసభలో ప్రసంగించిన ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును తమ పార్టీ పూర్తిగా సమర్ధిస్తున్నట్టు చెప్పారు.

బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షాకు హ్యాట్సాప్‌ చెప్పారు. ఇలాంటి ధైర్యసాహసానాలను ప్రదర్శించిన హోంమంత్రిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. తమ పార్టీ పూర్తిగా ఈ బిల్లుకు మద్దతు పలుకుతోందన్నారు.

నాటి ప్రధాని నెహ్రు… నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లాబాయ్‌ పటేల్ కు ఆరోజు స్వేచ్చ ఇచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు. జమ్ముకశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌లో భారత పతాకాన్ని తగలబెట్టినా నేరం కాదంటే ఎలా అని ప్రశ్నించారు.

జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక మహిళ పాకిస్తాన్‌ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అన్ని హక్కులు కొనసాగిస్తున్నప్పుడు… జమ్ముకశ్మీర్‌కే చెందిన మహిళ భారత్‌లో ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వతంగా కశ్మీర్‌లో హక్కులు కోల్పోవడాన్ని ఎలా సమర్ధిస్తామన్నారు. ఇది కశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అని ప్రశ్నించారు.

కశ్మీర్‌ సమస్య ఇంతకాలం రగులుతూనే ఉండడానికి కారణం నాటి ప్రధాని నెహ్రు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని…కశ్మీర్‌ అభివృద్ధికి దోహదం చేస్తుందని తాము ఆశిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

First Published:  5 Aug 2019 2:59 AM GMT
Next Story