Telugu Global
Cinema & Entertainment

బెల్లంకొండకు.... ఏడో సినిమా సెంటిమెంట్ కలిసొచ్చిందట!

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎట్టకేలకు ఒక పెద్ద విజయం అందింది. శుక్రవారం విడుదల అయిన రాక్షసుడు  సినిమా మంచి విజయం సాధించడం తో ఎంతో సంతోషం గా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ విషయం లో తన అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు. బెల్లంకొండ సురేష్ అయితే తన కొడుక్కి ఏడో సినిమా సెంటిమెంట్ వరించింది అని చెప్తున్నారు. “వెంకటేశ్ ను ఫాలో అవడం వల్లే ఈ విజయం వరించింది. సౌత్ లో నెంబర్ 1 […]

బెల్లంకొండకు.... ఏడో సినిమా సెంటిమెంట్ కలిసొచ్చిందట!
X

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎట్టకేలకు ఒక పెద్ద విజయం అందింది. శుక్రవారం విడుదల అయిన రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించడం తో ఎంతో సంతోషం గా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ విషయం లో తన అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు. బెల్లంకొండ సురేష్ అయితే తన కొడుక్కి ఏడో సినిమా సెంటిమెంట్ వరించింది అని చెప్తున్నారు.

“వెంకటేశ్ ను ఫాలో అవడం వల్లే ఈ విజయం వరించింది. సౌత్ లో నెంబర్ 1 సినిమాలున్న హీరో మా అబ్బాయి ఒక్కడే. సాయి చేసిన కొన్ని సినిమాలు తెలుగులో ఆర్థికంగా నష్టపోయినా హిందీలో మంచి వసూళ్లు రాబట్టాయి. అందుకే మా వాడిని త్వరలో హిందీ లో ప్రవేశపెడుతున్నాను. చాలా హీరోలకు ఏడో సినిమా సూపర్ హిట్టులున్నాయి. స్టార్ హీరోలు సైతం ఏడో సినిమా కి కరెక్ట్ గా విజయం సాధించారు. ఇప్పుడు మా వాడు కూడా అంతే. మా అబ్బాయి ఏడో సినిమా కూడా సూపర్ హిట్టైంది” అని బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్ గురించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు.

అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమా విడుదల కి ముందు జర్నలిస్ట్ అసోసియేషన్ కి పది లక్షల రూపాయలు కూడా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

First Published:  5 Aug 2019 4:56 AM GMT
Next Story