Telugu Global
NEWS

భారత్ కే టీ-20 సిరీస్

రెండోమ్యాచ్ లో 22 పరుగుల విజయం రోహిత్, కృణాల్ పాండ్యా షో ప్రపంచ చాంపియన్ విండీస్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే మాజీ చాంపియన్ భారత్.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది. ఫ్లారిడాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో మ్యాచ్ కు వర్షం దెబ్బ తగలడంతో…డక్ వర్త్-లూయిస్ విధానం ప్రకారం భారత్ ను 22 పరుగుల తేడాతో నెగ్గినట్లు ప్రకటించారు. సిరీస్ కే నిర్ణయాత్మకంగా […]

భారత్ కే టీ-20 సిరీస్
X
  • రెండోమ్యాచ్ లో 22 పరుగుల విజయం
  • రోహిత్, కృణాల్ పాండ్యా షో

ప్రపంచ చాంపియన్ విండీస్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే మాజీ చాంపియన్ భారత్.. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ను 2-0తో కైవసం చేసుకొంది.

ఫ్లారిడాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో మ్యాచ్ కు వర్షం దెబ్బ తగలడంతో…డక్ వర్త్-లూయిస్ విధానం ప్రకారం భారత్ ను 22 పరుగుల తేడాతో నెగ్గినట్లు ప్రకటించారు.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగుల స్కోరు సాధించింది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 51 బాల్స్ లో 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆల్ రౌండర్లు
కృణాల్ పాండ్యా13 బాల్స్ లో 2 సిక్సర్లతో 20 పరుగులు,జడేజా 4 బాల్స్ లో 9 పరుగులు సాధించారు. కెప్టెన్ విరాట్ కొహ్లీ 28
పరుగులకు కోట్రెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

విండీస్ కు వానదెబ్బ…

సమాధానంగా 168 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన విండీస్ వానదెబ్బతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 121 పరుగులు చేయాల్సి ఉండగా 98 పరుగులు మాత్రమే చేయడంతో …భారత్ 22 పరుగుల తేడాతో నెగ్గినట్లయ్యింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ గయానాలోని ఫ్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఈనెల 6న జరుగనుంది.

First Published:  4 Aug 2019 8:25 PM GMT
Next Story