Telugu Global
Cinema & Entertainment

సాహోకి దారిచ్చిన సూర్య

సాహో వాయిదా పడ్డంతో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు మాత్రమే దెబ్బ పడిందని అంతా అనుకున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సాహో దెబ్బ సూర్యకు కూడా తగిలింది. అవును.. సూర్య నటిస్తున్న బందోబస్త్ సినిమాను ఆగస్ట్ 30నే విడుదల చేయాలనుకున్నారు. సాహో తరహాలోనే సూర్య సినిమా కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవ్వాలి. కానీ సాహో రాకతో బందోబస్త్ తప్పుకోవాల్సి వచ్చింది. తమిళనాట సాహో సినిమా ప్రభావం సూర్యపై పెద్దగా […]

సాహోకి దారిచ్చిన సూర్య
X

సాహో వాయిదా పడ్డంతో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు మాత్రమే దెబ్బ పడిందని అంతా అనుకున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సాహో దెబ్బ సూర్యకు కూడా తగిలింది. అవును.. సూర్య నటిస్తున్న బందోబస్త్ సినిమాను ఆగస్ట్ 30నే విడుదల చేయాలనుకున్నారు. సాహో తరహాలోనే సూర్య సినిమా కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవ్వాలి. కానీ సాహో రాకతో బందోబస్త్ తప్పుకోవాల్సి వచ్చింది.

తమిళనాట సాహో సినిమా ప్రభావం సూర్యపై పెద్దగా ఉండదు. ఎందుకంటే కోలీవుడ్ లో సూర్య పెద్ద స్టార్. సాహో సినిమా అతడ్ని ఏమీ చేయలేదు. కానీ టాలీవుడ్ కు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్. సాహోకు పోటీగా బందోబస్త్ ను విడుదల చేస్తే, సమోసా డబ్బులు కూడా రావు. పైగా కన్నడనాట కూడా సూర్య-ప్రభాస్ సినిమాలకు సమానంగా మార్కెట్ ఉంది.

అసలే సూర్య మార్కెట్ తెలుగులో పూర్తిగా చతికిలపడిపోయింది. అటు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కన్నడ మార్కెట్ ను కూడా చేజేతులా నాశనం చేసుకున్నట్టవుతుంది. అందుకే బందోబస్త్ సినిమాను మరో ఆలోచన లేకుండా వాయిదావేశాడు సూర్య. ఆగస్ట్ 30 నుంచి ఈసినిమా ఏకంగా సెప్టెంబర్ 20కు వెళ్లిపోయింది. తాజాగా డేటెడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అదీ సంగతి.

First Published:  5 Aug 2019 4:50 AM GMT
Next Story