కళ్యాణ్ రామ్ కి తారక్ మరో అవకాశం…

నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరో గానే కాక…. నిర్మాత గా కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

అయితే కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో తారక్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ కోరిక బాబీ దర్శకత్వం లో వచ్చిన జై లవ కుశ సినిమా తో తీర్చుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఇంకొక సినిమా కూడా నిర్మించాలని అనుకున్నాడు…. కానీ సరైన కథ దొరక్కపోవడం తో కళ్యాణ్ రామ్ ఆ ప్రయత్నాన్ని అప్పుడు విరమించుకున్నాడు.

అయితే మొన్నామధ్య మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తారక్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అవ్వాలని అనుకుంటున్నాడట. కాకపోతే మైత్రి వాళ్ళ మధ్య నే చాలా తగాదాలు అవుతున్నాయట… అందుకే వేరే వాళ్ళను భాగస్వామి గా చేసుకోవడానికి వారు రెడీ గా లేరని పరోక్షం గా సందేశం పంపారట.

అయితే ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్ కి ఇంకో దారి చూపిస్తున్నాడు. ఎన్టీఆర్… త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసేది ఉంది. ఆ సినిమా నిర్మాణం లో కళ్యాణ్ రామ్ ని భాగస్వామి చేయాలి అని తారక్ నిర్ణయించుకున్నాడట.