Telugu Global
Cinema & Entertainment

తమిళ హిట్ సినిమాకు రీమేక్ రెడీ

కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న సినిమా విక్రమ్ వేథ. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్. ఇంత రియలిస్టిక్ యాక్షన్ సినిమా ఈమధ్య కాలంలో ఇంకొకటి రాలేదు. అదే అక్కడి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. టాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించింది. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే విక్రమ్ వేధ బాలీవుడ్ రీమేక్ కు రంగం సిద్ధమైంది. అవును.. హిందీలోకి వెళ్లబోతోంది […]

తమిళ హిట్ సినిమాకు రీమేక్ రెడీ
X

కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న సినిమా విక్రమ్ వేథ. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్. ఇంత రియలిస్టిక్ యాక్షన్ సినిమా ఈమధ్య కాలంలో ఇంకొకటి రాలేదు. అదే అక్కడి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. టాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించింది. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే విక్రమ్ వేధ బాలీవుడ్ రీమేక్ కు రంగం సిద్ధమైంది.

అవును.. హిందీలోకి వెళ్లబోతోంది విక్రమ్ వేధ. బాలీవుడ్ లో ఈ సినిమాను అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ చేయబోతున్నారు. తమిళ్ లో మాధవన్ పోషించిన పాత్రను సైఫ్ అలీఖాన్, విజయ్ సేతుపతి పోషించిన నెగెటివ్ పాత్రను అమీర్ ఖాన్ చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ కలిసి గతంలో దిల్ చాహ్ తా హై సినిమా చేశాడు. ఆ మూవీ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్.

తమిళ్ లో ఈ సినిమాను వై-నాట్ స్టుడియోస్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ఇదే సంస్థ హిందీలో కూడా నిర్మాణ భాగస్వామ్యంలో పాలుపంచుకుంటోంది. తెలుగులో ఈ సినిమా రీమేక్ అవ్వకపోవడానికి కూడా ఇదే కారణం. రీమేక్స్ రైట్స్ ను మరో నిర్మాతకు అమ్మడానికి “వై-నాట్” ఇష్టపడడం లేదు. నిర్మాణ భాగస్వామ్యం కోరుతోంది. హిందీలో ఈ ప్రతిపాదన వర్కవుట్ అయింది. తెలుగులో ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు. అంతే తేడా.

First Published:  5 Aug 2019 5:24 AM GMT
Next Story