తిరుపతిలో గ్యాంగ్ వార్… విద్యార్థి హత్య

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య గ్యాంగ్‌ వార్‌ ఒక విద్యార్థిని బలి తీసుకుంది. తిరుపతిలోని చదలవాడ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ద్వారకనాథ్‌ను తోటి విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. బీరు బాటిళ్లతో దాడి చేసి చంపేశారు. ద్వారకనాథ్‌ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు. తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటున్నారు. తిరుపతిలోని శెట్టిపల్లి ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ద్వారకనాథ్‌ చదువుకుంటున్నాడు.

కాలేజీలో విద్యార్థుల మధ్య ఇటీవల గొడవలు జరిగినట్టు భావిస్తున్నారు. దాంతో కొందరు విద్యార్థులు ద్వారకనాథ్‌ను శెట్టిపల్లి రైల్వే గేట్ వద్ద బీర్ బాటిళ్లతో కొట్టి, కత్తులతో మెడపై పొడిచి చంపేశారు. హత్యకు విద్యార్థుల గ్యాంగ్ వారే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.