Telugu Global
NEWS

విండీస్ తో నేడే ఆఖరి టీ-20

క్లీన్ స్వీప్ కు భారత్ గురి గయానా వేదికగా రాత్రి 8 గంటలకు సమరం భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో ఫ్లారిడా నుంచి కరీబియన్ గడ్డ గయానాకు చేరింది. జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా భారత్ క్లీన్ స్వీప్ విజయం సాధించాలన్నపట్టుదలతో ఉంది. ఫ్లారిడాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన మొదటి రెండు మ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా 2-0తో […]

విండీస్ తో నేడే ఆఖరి టీ-20
X
  • క్లీన్ స్వీప్ కు భారత్ గురి
  • గయానా వేదికగా రాత్రి 8 గంటలకు సమరం

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో ఫ్లారిడా నుంచి కరీబియన్ గడ్డ గయానాకు చేరింది. జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా భారత్ క్లీన్ స్వీప్ విజయం సాధించాలన్నపట్టుదలతో ఉంది.

ఫ్లారిడాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన మొదటి రెండు మ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్.. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరాటలో రాహుల్ చహార్, దీపక్ చహార్, శ్రేయస్ అయ్యర్ లాంటి రిజర్వ్ ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపుల వార్నింగ్…

జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ కు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మొదటి రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన కరీబియన్ టీమ్ కనీసం ఆఖరిమ్యాచ్ లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. గత రెండుమ్యాచ్ ల్లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

భారత్ ప్రత్యర్థిగా 2017 నుంచి ఆడిన ఐదుకు ఐదుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన విండీస్ టీమ్..తొలిగెలుపు కోసం తహతహలాడుతోంది.

భారత్ తుదిజట్టులో మార్పుల ద్వారా ప్రయోగాల సాహసం చేస్తుందా ? లేక విండీస్ విజయంతో భారత్ వరుస విజయాలకు బ్రేక్ వేస్తుందా? తెలుసుకోవాలంటే… మరికొద్ది గంటల పాటు వేచిచూడక తప్పదు.

First Published:  6 Aug 2019 2:40 AM GMT
Next Story