Telugu Global
Cinema & Entertainment

బల్గేరియాకి.... జూనియర్ ఎన్టీఆర్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకే కాకుండా మామూలు సినిమా ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర లో కనిపిస్తుండగా, ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమా లో చాలా కీలకమట. షూటింగ్ పరంగా కూడా ఎన్టీఆర్ ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ […]

బల్గేరియాకి.... జూనియర్ ఎన్టీఆర్
X

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకే కాకుండా మామూలు సినిమా ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర లో కనిపిస్తుండగా, ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమా లో చాలా కీలకమట. షూటింగ్ పరంగా కూడా ఎన్టీఆర్ ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ తర్వాతి షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లనున్నాడని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ ఇప్పటికే మొదలైందని…. కానీ తారక్ మాత్రం ఈ నెల 13 న షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు.

First Published:  6 Aug 2019 1:35 AM GMT
Next Story