Telugu Global
NEWS

లోక్‌సత్తా జేపీపై కేసీఆర్‌ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు, కరెంట్‌ బిల్లు సొమ్ముతో ఒక్కో రైతుకు లక్ష రూపాయలు ఇవ్వొచ్చంటూ జేపీ వ్యాఖ్యలు చేశారని కొందరు విలేకరులు కేసీఆర్‌ వద్ద ప్రస్తావించారు. అందుకు స్పందించిన కేసీఆర్‌.. జయప్రకాశ్‌ నారాయణ మాటలను ఇద్దరు ముగ్గురు తన దృష్టికి కూడా తెచ్చారన్నారు. జేపీ వ్యాఖ్యలు అతడి హాఫ్ నాలెడ్జ్‌కు నిదర్శనమన్నారు. ఏ ప్రతిపాదికన కాళేశ్వరంపై జేపీ విమర్శలు […]

లోక్‌సత్తా జేపీపై కేసీఆర్‌ ఫైర్
X

కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు, కరెంట్‌ బిల్లు సొమ్ముతో ఒక్కో రైతుకు లక్ష రూపాయలు ఇవ్వొచ్చంటూ జేపీ వ్యాఖ్యలు చేశారని కొందరు విలేకరులు కేసీఆర్‌ వద్ద ప్రస్తావించారు. అందుకు స్పందించిన కేసీఆర్‌.. జయప్రకాశ్‌ నారాయణ మాటలను ఇద్దరు ముగ్గురు తన దృష్టికి కూడా తెచ్చారన్నారు.

జేపీ వ్యాఖ్యలు అతడి హాఫ్ నాలెడ్జ్‌కు నిదర్శనమన్నారు. ఏ ప్రతిపాదికన కాళేశ్వరంపై జేపీ విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు జయప్రకాశ్‌ నారాయణకు ఉన్న అర్హత ఏమిటి? అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. 50లక్షల రైతులకు జీవం పోస్తున్న ప్రాజెక్టు కోసం ఐదు వేల కోట్ల కరెంట్ బిల్లు కడితే కొంపలు మునిగిపోతాయా? అని ప్రశ్నించారు. జేపీ లాంటి వారు ఈర్షతో, అసూయతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

రైతుల గురించి జయప్రకాశ్‌నారాయణకు ఏం తెలుసని ప్రశ్నించారు. రైతుల అవసరాలపై జేపీకి ఏమాత్రం అవగాహన ఉన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు భారీగా బోర్లు వేసి అప్పుల్లో కూరుకుపోయారని… వారిని గట్టెక్కించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్‌ చెప్పారు. జయప్రకాశ్‌ నారాయణ తన పని తాను చేసుకుంటే బాగుంటుందని కేసీఆర్‌ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన తర్వాత ధర్మపురిలో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు.

First Published:  6 Aug 2019 7:12 AM GMT
Next Story