Telugu Global
Cinema & Entertainment

'మన్మథుడు 2'.... సెన్సార్ రిపోర్ట్

2002 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ , ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ‘మన్మధుడు’ లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ […]

మన్మథుడు 2.... సెన్సార్ రిపోర్ట్
X

2002 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

నాగార్జున, రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ , ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

‘మన్మధుడు’ లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికేషన్ కి పంపించారు దర్శక నిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం…. ‘మన్మధుడు 2’ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. చిత్ర టీజర్ మరియు ట్రైలర్ చూస్తేనే సినిమాలో బోలెడు లిప్ లాక్ లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పోర్చుగల్ లో జరిగింది.

వెన్నెల కిషోర్, లక్ష్మీ, దేవదర్శిని, ఝాన్సీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సమంత అక్కినేని, అక్షర గౌడ మరియు కీర్తి సురేష్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది. నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.

First Published:  6 Aug 2019 5:08 AM GMT
Next Story