Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ సినిమాని ప్రమోట్ చేస్తున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో మంచి స్నేహం ఉంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరపు దాదాపు అందరూ ప్రభాస్ కి మంచి స్నేహితులే. తాజాగా ప్రభాస్… శర్వానంద్ సినిమాని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్… సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అని ఒక మాస్ యాక్షన్ డ్రామా […]

శర్వానంద్ సినిమాని ప్రమోట్ చేస్తున్న ప్రభాస్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో మంచి స్నేహం ఉంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరపు దాదాపు అందరూ ప్రభాస్ కి మంచి స్నేహితులే.

తాజాగా ప్రభాస్… శర్వానంద్ సినిమాని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్… సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అని ఒక మాస్ యాక్షన్ డ్రామా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

శర్వానంద్ ఒక గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా అదే ట్రైలర్ ను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేస్తూ ప్రభాస్ ఒక కామెంట్ ను ట్యాగ్ చేశాడు.

“డార్లింగ్ శర్వా మరియు రణరంగం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ట్రైలర్ చూడండి” అని ప్రభాస్ పోస్ట్ చేశారు. దీంతో శర్వానంద్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. మరి ఈ సినిమాతో శర్వా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

First Published:  6 Aug 2019 3:44 AM GMT
Next Story