Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ లుక్ ఉంది.... కానీ సర్ ప్రైస్....

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా లో మహేష్ సైనికుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే కాశ్మీర్ లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం సినిమా ని హైదరాబాద్ లో […]

ఫస్ట్ లుక్ ఉంది.... కానీ సర్ ప్రైస్....
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా లో మహేష్ సైనికుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే కాశ్మీర్ లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం సినిమా ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తుంది.

ఇకపోతే ఈ సినిమా కి సంబందించిన అప్ డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అభిమానులకి, ప్రేక్షకులకి క్రమం తప్పకుండా ఇస్తూ వస్తుంది చిత్ర యూనిట్.

అయితే ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో… చిత్ర యూనిట్ స్పెషల్ గా పోస్టర్ ఏదైనా విడుదల చేస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది. కాకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందా? టీజర్ ఉంటుందా? అసలు ఏం చేస్తారు? అనే ఆసక్తి అందరిలో ఉంది.

విశ్వసనీయ వర్గాల కథనాల ప్రకారం ఆ రోజు ఫస్ట్ లుక్ కచ్చితంగా ఉంటుందట… కానీ ఒక సర్ ప్రైస్ లాగా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ రోజే మహేష్ పుట్టినరోజు సందర్భంగా అని ఒక కామన్ డీపీ ని విడుదల చేశారు అభిమానులు.

First Published:  6 Aug 2019 1:05 AM GMT
Next Story