Telugu Global
Cinema & Entertainment

'నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళినా సందేహిస్తున్నారు' " రానా

గత కొద్దిరోజుల క్రితం రానా దగ్గుబాటి…. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లుగా ఈ విషయమై సైలెంట్ గా ఉన్న రానా ఇప్పుడు నోరు విప్పాడు. “ఇప్పటిదాకా నా గురించి చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పలేక నేను అలసిపోయాను. నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి వచ్చిన పుకార్లు విని విని నాకు బోర్ కొట్టింది. నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళినా సరే సందేహిస్తున్నారు. కానీ […]

నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళినా సందేహిస్తున్నారు  రానా
X

గత కొద్దిరోజుల క్రితం రానా దగ్గుబాటి…. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లుగా ఈ విషయమై సైలెంట్ గా ఉన్న రానా ఇప్పుడు నోరు విప్పాడు.

“ఇప్పటిదాకా నా గురించి చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పలేక నేను అలసిపోయాను. నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి వచ్చిన పుకార్లు విని విని నాకు బోర్ కొట్టింది. నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళినా సరే సందేహిస్తున్నారు. కానీ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమకి సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు రానా.

ఇక ఒకవైపు పలు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రముఖ శ్రీలంకన్ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్ర పోషించబోతున్నాడు.

ఈ బయోపిక్ లో చాలా కాంఫ్లిక్స్, ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఉంటాయని అన్నాడు రానా. మరి ఈ బయోపిక్ లో రానా కూడా గెస్ట్ పాత్ర పోషిస్తారా? అని అడిగితే క్యాస్టింగ్ అనేది స్క్రిప్ట్ కి సూట్ అయ్యే విధంగా ఉండాలని…. ఈ సినిమాని కేవలం సహనిర్మాత దృష్టితో మాత్రమే చూస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు రానా.

First Published:  7 Aug 2019 4:14 AM GMT
Next Story