Telugu Global
Cinema & Entertainment

నితిన్, రమేష్ వర్మ.. సినిమా ఆగిపోయింది!

రమేష్ వర్మ ‘ఒక ఊరిలో’ అనే సినిమా తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించనప్పటికీ ఇండస్ట్రీ లో మాత్రం దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రవి తేజ తో ‘వీర’ అనే సినిమా చేసినా అది హిట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత నిర్మాణ రంగంలో కి అడుగు పెట్టాడు… కానీ విజయం సాధించలేదు… అయితే ఎట్టకేలకు ఇటీవలే వచ్చిన రాక్షసుడు సినిమా తో విజయం సాధించాడు. రీమేక్ సినిమా […]

నితిన్, రమేష్ వర్మ.. సినిమా ఆగిపోయింది!
X

రమేష్ వర్మ ‘ఒక ఊరిలో’ అనే సినిమా తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించనప్పటికీ ఇండస్ట్రీ లో మాత్రం దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రవి తేజ తో ‘వీర’ అనే సినిమా చేసినా అది హిట్ అవ్వలేదు.

ఇక ఆ తర్వాత నిర్మాణ రంగంలో కి అడుగు పెట్టాడు… కానీ విజయం సాధించలేదు… అయితే ఎట్టకేలకు ఇటీవలే వచ్చిన రాక్షసుడు సినిమా తో విజయం సాధించాడు.

రీమేక్ సినిమా అయినా దానిని బాగా ప్రెజెంట్ చేయడం తో ఈ సినిమా మంచి విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కి కూడా కెరీర్ లోనే మంచి విజయం దక్కింది ఈ సినిమాతో. అయితే ఈ దర్శకుడు నితిన్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి అనేకసార్లు డైరెక్టర్ రమేష్, హీరో నితిన్ కూడా ప్రస్తావించారు…. కానీ ఇప్పుడు ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందట.

నితిన్ ముందుగా సినిమా చేద్దాం అనుకున్నాడట…. కానీ ఇప్పుడు ఎందుకో ఆ సినిమా చేయట్లేదు అని చెప్పాడట. కారణాలు ఏంటి అని మాత్రి క్లియర్ గా రమేష్ వర్మ వివరించలేదు….. కానీ సినిమా మాత్రం ఆగిపోయిందని తెలిపాడు.

First Published:  7 Aug 2019 4:57 AM GMT
Next Story