నాగార్జున చేతిలో ఒక్క సినిమా కూడా లేదు

అవును.. మీరు చదివింది నిజమే… నాగార్జున చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. మన్మథుడు-2ను విడుదలకు సిద్ధం చేసిన ఈ సీనియర్ హీరో నెక్ట్స్ చేయడానికి సినిమాలు లేవు. ఇవేవీ గాసిప్స్ కావు. స్వయంగా అతడే చెబుతున్న వాస్తవాలు. మరీ ముఖ్యంగా బంగార్రాజు సినిమా ఇప్పుడు తన చేతుల్లో లేదంటున్నాడు నాగ్.

దాదాపు ఏడాదిగా బంగార్రాజు సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఇక అంతా సెట్ అయిందనుకునే టైమ్ లో కల్యాణ్ కృష్ణ అన్నయ్య హఠాత్తుగా కన్నుమూశాడు. ఇక అప్పట్నించి కల్యాణ్ కృష్ణతో టచ్ లోకి వెళ్లలేదట నాగార్జున. ఈ టైమ్ లో కల్యాణ్ ను తొందరపెట్టడం తనకు ఇష్టంలేదని, అతడు ఎప్పుడొస్తే అప్పుడే ఆ సినిమా గురించి చర్చిస్తానని ప్రకటించాడు.

ఈ సినిమా తప్ప నాగ్ దగ్గర మరో దర్శకుడు లేడు. రీసెంట్ గా కొత్త కథలు చెప్పిన దాఖలాలు లేవు. ఓవైపు హిందీలో బ్రహ్మాస్త్ర చేస్తున్నాడు నాగ్. ఆ సినిమాకు సంబంధించి నాగ్ షెడ్యూల్ అయిపోయింది. అది కూడా లేదు. ఇక తమిళ్ లో ధనుష్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. పోనీ అదయినా చేద్దామంటే.. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఈ విషయాల్ని కూడా నాగార్జునే చెప్పుకొచ్చాడు.