గ్యాంగ్ లీడర్.. కొత్త రిలీజ్ డేట్

లెక్కప్రకారం ఈనెల 30న థియేటర్లలోకి రావాలి గ్యాంగ్ లీడర్ సినిమా. కానీ ఆ తేదీకి అనుకోకుండా సాహో వచ్చి పడింది. దీంతో నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాను అనివార్యంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సాహో సినిమాకు సంబంధించి డేట్ తో పాటు పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో, నాని సినిమా వాయిదా పడిందనేది ఫిక్స్ అయింది. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఎవ్వరూ నిర్థారించలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు.

ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాకు ఓ కొత్త తేదీ కోసం మొన్నటివరకు తెరవెనక కసరత్తు చేసిన యూనిట్.. ఇప్పుడు ఓ తేదీని ఫిక్స్ చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అదే రోజు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకి సినిమా వస్తోంది. అంటే.. గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ అన్నమాట.

అయితే సెప్టెంబర్ 13 తేదీకి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు. ఆ తేదీ ఆల్ మోస్ట్ ఫిక్స్ అని కొందరు అంటుంటే.. ఆ తేదీకి కూడా గ్యాంగ్ లీడర్ వచ్చే ఛాన్స్ లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్ రెడీ అవుతోంది. అందులో విడుదల తేదీని ప్రింట్ చేయబోతున్నారని చెబుతున్నారు.