Telugu Global
Cinema & Entertainment

నేను సిగరెట్ తాగితే తప్పేంటి?

మన్మథుడు-2 ట్రయిలర్ లో రకుల్ సిగరెట్ తాగుతూ కనిపించింది. దీనిపై ఆమధ్య చాలా రాద్దాంతమే జరిగింది. నిజ జీవితంలో కూడా ఆమె సిగరెట్ తాగుతుందంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై రకుల్ స్పందించింది. సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్, తన సిగరెట్ స్మోకింగ్ సీన్ పై రియాక్ట్ అయింది. “సినిమాలో నేను కొన్ని సందర్భాల్లో సిగరెట్ కాలుస్తాను. రొమాంటిక్ సీన్స్ కూడా చేసాను. అవన్నీ క్యారెక్టర్ లో భాగమే. నిజ జీవితంలో నేను సిగరెట్ తాగను. […]

నేను సిగరెట్ తాగితే తప్పేంటి?
X

మన్మథుడు-2 ట్రయిలర్ లో రకుల్ సిగరెట్ తాగుతూ కనిపించింది. దీనిపై ఆమధ్య చాలా రాద్దాంతమే జరిగింది. నిజ జీవితంలో కూడా ఆమె సిగరెట్ తాగుతుందంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై రకుల్ స్పందించింది. సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్, తన సిగరెట్ స్మోకింగ్ సీన్ పై రియాక్ట్ అయింది.

“సినిమాలో నేను కొన్ని సందర్భాల్లో సిగరెట్ కాలుస్తాను. రొమాంటిక్ సీన్స్ కూడా చేసాను. అవన్నీ క్యారెక్టర్ లో భాగమే. నిజ జీవితంలో నేను సిగరెట్ తాగను. చాలా ఆరోగ్యంగా ఉంటాను. కాని సినిమా కోసం డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ కోసం కొన్ని చేయక తప్పదు. నటిగా అది నా భాద్యత. సినిమా చూశాక ఆడియన్స్ అవన్నీ పట్టించుకోరు.”

ఇక సీనియర్ హీరోలతో నటించడంపై కూడా రకుల్ స్పందించింది. కథ డిమాండ్ చేస్తే వయసులో తనకంటే ఎంత పెద్ద హీరోతోనైనా నటిస్తానని కుండబద్దలుకొట్టింది. అంతేకాదు, అలాంటి అవకాశం రావడమే గొప్ప అన్నట్టు రియాక్ట్ అయింది.

“సీనియర్ హీరోలతో ఛాన్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. మిగతావి పట్టించుకోను. స్టోరీ కి ఏం అవసరం… ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఏంటనేది మాత్రం చూస్తాను. ‘దే దే ప్యార్ దే’ ,’మన్మధుడు 2′ లో హీరోలు సీనియర్సే కానీ అందులో నా వయసు తక్కువే. నాలా నేను కనిపిస్తా. అలాంటి రోల్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. చేస్తే తప్పేంటి.. ఒక యంగ్ హీరో సినిమాలో నాలుగు సీన్స్, మూడు సాంగ్స్ ఉండే క్యారెక్టర్ కంటే ఇలాంటి సినిమాలు చేయడం తప్పేం కాదు.”

రాహుల్ డైరక్ట్ చేసిన మన్మథుడు-2 సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది మన్మథుడు-2.

First Published:  7 Aug 2019 12:51 AM GMT
Next Story