Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ... బోయపాటి... రకుల్ !

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా మొదలుపెట్టడాడు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగం గా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో చేయనున్న సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. […]

బాలకృష్ణ... బోయపాటి... రకుల్ !
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా మొదలుపెట్టడాడు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగం గా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు.

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో చేయనున్న సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. సింహ, లెజెండ్ వంటి హిట్స్ తర్వాత వస్తున్న చిత్రం ఇది కావడం తో ఈ సినిమా మీద అంచనాలు భారీ గా నే ఉన్నాయి.

ఇప్పటికే రకుల్ ప్రీత్ తో బోయపాటి ఆల్రెడీ పని చేయడం తో ఈ సినిమా కి కూడా రకుల్ నే తీసుకోవాలని బోయపాటి నిర్ణయించుకున్నాడట. అంతే కాకుండా రకుల్ ఈ మధ్య సీనియర్ హీరోల సరసన ఎక్కువగా నటిస్తూ ఉండటం తో… బాలకృష్ణతో సినిమాకి ఓకే చెబుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా కూడా ఒక మాస్ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి.

First Published:  7 Aug 2019 4:41 AM GMT
Next Story