టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ లోనే కొహ్లీ

  • మూడోర్యాంక్ కు పుంజుకొన్న స్టీవ్ స్మిత్ 
  • నాలుగో ర్యాంక్ లో చతేశ్వర్ పూజారా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకొన్నాడు. ప్రపంచ మాజీ నంబర్ వన్ బ్యాట్స్ మన్, కంగారూ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అనూహ్యంగా పుంజుకొని మూడోర్యాంక్ లో నిలిచాడు.

బర్మింగ్ హామ్ టెస్ట్ లో స్మిత్ షో..

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధాన్ని అనుభవించి… ప్రస్తుత యాషెస్ సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ చేసిన స్టీవ్ స్మిత్ తన సత్తా ఏపాటిదో.. ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు.

ఇంగ్లండ్ తో ముగిసిన తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 144, రెండో ఇన్నింగ్స్ లో 142 పరుగులు సాధించిన స్మిత్..తన జట్టు సాధించిన 251 పరుగుల భారీ విజయంలో ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.

922 పాయింట్లతో కొహ్లీ టాప్…

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మొత్తం 922 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. 913
పాయింట్లతో కేన్ విలియమ్స్ సన్ రెండు, 900 పాయింట్లతో స్మిత్ మూడుస్థానాలలో నిలిచారు.

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా 857 ర్యాంకింగ్ పాయింట్లతో నాలుగోస్థానానికి పడిపోయాడు.

బౌలింగ్ విభాగంలో కంగారూ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ 898 పాయింట్లతో టాప్ ర్యాంక్ నిలబెట్టుకొన్నాడు. గత 50 సంవత్సరాలలో ఇంత భారీగా ర్యాంకింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆస్ట్ర్రేలియా బౌలర్ గా కమిన్స్ నిలిచాడు.