Telugu Global
Cinema & Entertainment

ప్రమోషన్స్ కు దూరంగా.... విజయ్ దేవరకొండ

భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల అయింది. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకి…. విడుదలకి ముందు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన చిత్ర బృందం సినిమా విడుదలైన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. నిజానికి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత కూడా ఏదో ఒకలాగా సినిమాని […]

ప్రమోషన్స్ కు దూరంగా.... విజయ్ దేవరకొండ
X

భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల అయింది. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకి…. విడుదలకి ముందు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన చిత్ర బృందం సినిమా విడుదలైన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది.

నిజానికి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత కూడా ఏదో ఒకలాగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలైన మొదటి వారం తరువాత సినిమా ప్రమోషన్ కి గుడ్ బై చెప్పేసాడు.

ఈ మధ్యనే రామ్ హీరోగా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా మొదటి వారం మంచి రివ్యూ లను అందుకుంది. విడుదలైన తర్వాత కూడా చిత్ర బృందం ప్రమోషన్లను ఆపలేదు. సినిమా ఎప్పుడో జూలై 19న విడుదల అయినప్పటికీ రెండు మూడు రోజుల క్రితమే హీరో రామ్ బిగ్ బాస్ షో కి వెళ్లి మరి తన సినిమాని ప్రమోట్ చేశాడు.

కానీ జూలై 26 న విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ సినిమాని మాత్రం విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై కూడా విజయ్ దృష్టి పెడితే కలెక్షన్స్ కొంచెం అయినా పుంజుకుని ఉండేవని అంటున్నారు.

First Published:  7 Aug 2019 4:45 AM GMT
Next Story