Telugu Global
Cinema & Entertainment

యాక్షన్, పాట.... షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ…. ‘జైసింహ’ సినిమా దర్శకుడైన కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రూలర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. మాస్ కమర్షియల్ ఎంటర్ టైనింగ్ గా  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఒక యాక్షన్ సన్నివేశం మరియు ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. మరీ ఎక్కువ బ్రేక్ లేమీ లేకుండా ఈ సినిమా షూటింగ్ ని […]

యాక్షన్, పాట.... షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ
X

నందమూరి బాలకృష్ణ…. ‘జైసింహ’ సినిమా దర్శకుడైన కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రూలర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

మాస్ కమర్షియల్ ఎంటర్ టైనింగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఒక యాక్షన్ సన్నివేశం మరియు ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది.

మరీ ఎక్కువ బ్రేక్ లేమీ లేకుండా ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. సోనాల్ చౌహాన్ మరియు వేదిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నందువల్ల బాలకృష్ణ సోలో రిలీజ్ కోసం ఈ ఏడాది క్రిస్టమస్ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ పాత్రకి ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లేదా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి…. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  8 Aug 2019 1:15 AM GMT
Next Story