Telugu Global
International

ఇప్పుడు పరిస్థితిని అంచనా వేయడం సరికాదు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కశ్మీర్ మొత్తం నిర్బంధంలో ఉందని… కర్ప్యూ కొనసాగుతోందని ఈ పరిస్థితుల్లో కశ్మీర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది అంచనా వేయలేమన్నారు. ఒకసారి కర్ప్యూ ఎత్తివేస్తే కశ్మీర్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎలా స్పందిస్తారన్నది తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల కశ్మీరీల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అటు ఆజాద్‌ నేడు […]

ఇప్పుడు పరిస్థితిని అంచనా వేయడం సరికాదు
X

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కశ్మీర్ మొత్తం నిర్బంధంలో ఉందని… కర్ప్యూ కొనసాగుతోందని ఈ పరిస్థితుల్లో కశ్మీర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది అంచనా వేయలేమన్నారు. ఒకసారి కర్ప్యూ ఎత్తివేస్తే కశ్మీర్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎలా స్పందిస్తారన్నది తెలుస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల కశ్మీరీల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అటు ఆజాద్‌ నేడు శ్రీనగర్‌ వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన వెళ్తున్నారు.

అయితే ఆజాద్‌ను శ్రీనగర్‌లోకి భద్రతా దళాలు అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది. కశ్మీర్‌లో పరిస్థితుల దృష్ట్యా ఆజాద్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని తిరిగి ఢిల్లీ పంపించే అవకాశాలున్నాయి.

కశ్మీర్‌లో దాదాపు 400 మంది ప్రొఫెసర్లు, వేర్పాటు వాదులను పోలీసులు నిర్బంధంలో ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మరోవైపు కశ్మీర్‌లో పరిస్థితులపై స్థానిక జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక్కడి పరిస్థితులను బయటి ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా మీడియాకు దక్కడం లేదని చెబుతున్నాయి.

కశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న నిర్బంధం పట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు అంతర్జాతీయ మీడియా సంఘాలు జోక్యం చేసుకోవాలని కశ్మీర్ ప్రెస్ క్లబ్ విజ్ఞప్తి చేసింది.

First Published:  7 Aug 2019 9:00 PM GMT
Next Story