Telugu Global
Cinema & Entertainment

ఇస్మార్ట్ శంకర్ తాజా వసూళ్లు

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఈమధ్య కాలంలో మాస్ సినిమాల్లేక మొహం వాచిన జనాలకు పండగ తీసుకొచ్చింది. కుర్రాళ్లైతే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అసభ్యకరంగా ఉన్నప్పటికీ అమ్మాయిలు కూడా ఎగబడ్డం విశేషం. అలా నిన్నటితో 3 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ సాధించింది. విడుదలైన ఈ 21 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల 54 లక్షల […]

ఇస్మార్ట్ శంకర్ తాజా వసూళ్లు
X

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఈమధ్య కాలంలో మాస్ సినిమాల్లేక మొహం వాచిన జనాలకు పండగ తీసుకొచ్చింది. కుర్రాళ్లైతే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అసభ్యకరంగా ఉన్నప్పటికీ అమ్మాయిలు కూడా ఎగబడ్డం విశేషం. అలా నిన్నటితో 3 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ సాధించింది.

విడుదలైన ఈ 21 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల 54 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. అటు వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ సినిమా వసూళ్లు 38 కోట్ల రూపాయల్ని టచ్ చేశాయి. ఈ సినిమాకు 18 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్-ఈవెన్ అయినట్టే. అలాంటిది ఏకంగా 38 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే నిర్మాతలు, బయ్యర్లకు రెట్టింపు లాభాలన్నమాట. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 78 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అటు పూరి జగన్నాధ్ కూడా చాన్నాళ్ల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. ఈ ఉత్సాహంతో వీళ్లిద్దరూ చకచకా లైనప్స్ రెడీ చేస్తున్నారు. రామ్ మరో మాస్ కథ కోసం ఎదురుచూస్తున్నాడు. అటు పూరి, ఏకంగా విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

First Published:  8 Aug 2019 10:55 AM GMT
Next Story