Telugu Global
Cinema & Entertainment

పెద్ద నిర్మాణ సంస్థలో.... రాహుల్ రవీంద్రన్ నెక్స్ట్ సినిమా ఇదే !

హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాహుల్ రవీంద్రన్… సుశాంత్-రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాహుల్ రవీంద్రన్… రెండవ సినిమాతోనే ఏకంగా సినియర్ హీరో నాగార్జున సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల సిద్ధమవుతోంది. ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో…. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ఖచ్చితంగా […]

పెద్ద నిర్మాణ సంస్థలో.... రాహుల్ రవీంద్రన్ నెక్స్ట్ సినిమా ఇదే !
X

హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాహుల్ రవీంద్రన్… సుశాంత్-రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాహుల్ రవీంద్రన్… రెండవ సినిమాతోనే ఏకంగా సినియర్ హీరో నాగార్జున సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల సిద్ధమవుతోంది.

ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో…. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడట.

అయితే ప్రస్తుతం ‘మన్మధుడు 2’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాహుల్ రవీంద్రన్ తన తదుపరి సినిమా ని లైన్ లో పెట్టినట్లు సమాచారం.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు మరియు ఇతర వివరాల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

First Published:  8 Aug 2019 12:13 AM GMT
Next Story