Telugu Global
Cinema & Entertainment

సాహో ట్రైలర్.... ముహూర్తం ఫిక్స్

ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు మేకింగ్ వీడియో ల కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది సాహో. ఇప్పటికే ప్రమోషన్లను మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను […]

సాహో ట్రైలర్.... ముహూర్తం ఫిక్స్
X

ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు మేకింగ్ వీడియో ల కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది సాహో. ఇప్పటికే ప్రమోషన్లను మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ ట్రైలర్ ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిరా బేడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టీ-సిరీస్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా మారబోతున్నాయి అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంటుందని సమాచారం.

Darlings, it’s now time to enter the Saaho world! #SaahoTrailer out on 10th August ! Stay tuned…#SaahoOnAugust30 #Saaho

Posted by Prabhas on Wednesday, 7 August 2019

First Published:  8 Aug 2019 1:32 AM GMT
Next Story