వరంగల్ చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరి…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన…. వరంగల్‌లో చిన్నారిపై హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఘటన జరిగిన 48 రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది.

తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అత్యాచారానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. జూన్‌ 18న శ్రీహితపై ప్రవీణ్ దారుణానికి ఒడిగట్టాడు.

ప్రవీణ్‌ తరపున వాదించేందుకు ఏ న్యాయవాది కూడా ముందుకు రాలేదు. కేసును విచారించిన న్యాయమూర్తి, బలమైన సాక్ష్యాలు ఉండడంతో ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధించారు.