‘గ్యాంగ్ లీడర్’…. అఫిషియల్ డేట్ పోస్టర్….

‘జెర్సీ’ అనే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో క్రికెటర్ పాత్రలో అందరిని మెప్పించిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు తన తదుపరి సినిమా అయిన ‘గ్యాంగ్ లీడర్’ లో పెన్సిల్ పార్థసారథి అనే ఒక రైటర్ పాత్రలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ, శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నాని మరియు ఐదుగురు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

ఈ సినిమా ఆగస్టు 30న విడుదల అవుతుందని గతంలో ప్రకటించేశారు దర్శక నిర్మాతలు. కానీ అనుకోకుండా ‘సాహో’ సినిమా కూడా అదే రోజుకి వాయిదా పడటంతో చేసేదిలేక ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.

తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో నానికి, చిత్ర బృందానికి సినిమా ప్రమోషన్ కోసం మరింత సమయం దొరికింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.