విదేశాల్లో…. సాహో !

ప్రభాస్ హీరో గా ఈ నెల 30 న రానున్న సినిమా సాహో. ఈ సినిమా లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో శ్రద్ధ సౌత్ లో కి అడుగు పెడుతుంది.

అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే  శ్రద్ధ కపూర్… బాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ చూస్తుకుంటూ ఉంటె, ప్రభాస్ సౌత్ తో పాటు ఇతర దేశాలు కవర్ చేయనున్నాడు.

నిజానికి ప్రభాస్ కన్నా శ్రద్ధ బాలీవుడ్ లో అందరికీ తెలుసు. కానీ సినిమా బిజినెస్ ప్రభాస్ పేరు మీద జరిగింది. పైగా ప్రభాస్ కి బాలీవుడ్ లో ప్రమోషన్స్ కొత్త. అందుకే ఎక్కువ రోజులు ముంబై లో గడపకుండా, ప్రభాస్ మాత్రం ఇతర దేశాలను టార్గెట్ చేయనున్నాడు.

త్వరలోనే సౌత్ ఇండియాలోని ప్రముఖ పట్టణాలతో పాటు, సింగపూర్, దుబాయ్, అమెరికా వంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ తన సినిమాని ప్రమోట్ చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే 300 కోట్లకు పైగా పెట్టిన నిర్మాతలు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విజయం సాధించాలని కొత్త కొత్త ప్లాన్స్ తో ముందుకు పోతున్నారు.