‘సాహో’ని…. ‘సైరా’ ఇలా వాడుకోబోతోంది!

ఈ నెల 30 న ప్రతిష్టాత్మకం గా విడుదల అవుతున్న సినిమా సాహో. ప్రభాస్ హీరో గా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ఈ సినిమా లో నటించారు. ఈ సినిమా ఈనెల 15 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది.

అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సినిమాతో పాటు మెగా స్టార్ చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డి సినిమా ట్రైలర్ ని కూడా నిర్మాతలు తీసుకొని వస్తున్నారట.

సాహో లాంటి సినిమా తో ట్రైలర్ వస్తే, సినిమా పై అంచనాలు పెరుగుతాయని…. బాగా ప్రచారం కూడా వస్తుందన్న ఆలోచనలో ఉన్నారట సై రా నిర్మాతలు. ఆ దిశగా ట్రైలర్ ని కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

సై రా ట్రైలర్ ని ఇతర భాషల్లో కూడా డబ్ చేసి సాహో తో అటాచ్ చేయాలనే విధంగా కూడా ఆలోచిస్తున్నారట. అయితే ఈ ట్రైలర్ ని అధికారికం గా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ని సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.