Telugu Global
NEWS

వానదెబ్బతో తొలివన్డే రద్దు

ఇవిన్ లూయిస్ మెరుపులు, వరుణదేవుడి ఉరుములు విండీస్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు భారత్- విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ కు వానదెబ్బ తగిలింది. గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం 13 ఓవర్లకే అర్థంతరంగా ముగిసిపోయింది. వరుణుడి ప్రతాపం… దక్షిణ అమెరికా ఖండ దేశం గయానాలో ప్రస్తుతం వానాకాలం కావడంతో..గత కొద్దిరోజులుగా వానపడుతూనే ఉంది. మ్యాచ్ కు ముందురోజు కురిసిన భారీ వర్షంతో…నిర్ణిత సమయం కంటే […]

వానదెబ్బతో తొలివన్డే రద్దు
X
  • ఇవిన్ లూయిస్ మెరుపులు, వరుణదేవుడి ఉరుములు
  • విండీస్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు

భారత్- విండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ కు వానదెబ్బ తగిలింది. గయానాలోని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం 13 ఓవర్లకే అర్థంతరంగా ముగిసిపోయింది.

వరుణుడి ప్రతాపం…

దక్షిణ అమెరికా ఖండ దేశం గయానాలో ప్రస్తుతం వానాకాలం కావడంతో..గత కొద్దిరోజులుగా వానపడుతూనే ఉంది. మ్యాచ్ కు ముందురోజు కురిసిన భారీ వర్షంతో…నిర్ణిత సమయం కంటే గంట ఆలస్యంగా టాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టాస్ నెగ్గడంలో కొహ్లీ బాస్…

ప్రస్తుత టూర్ లోని తీన్మార్ టీ-20 సిరీస్ లో వరుసగా మూడుటాస్ లతో పాటు మ్యాచ్ లు నెగ్గిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ లో సైతం టాస్ నెగ్గి… మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

వర్షం కారణంగా 50 ఓవర్లమ్యాచ్ ను కాస్త 43 ఓవర్లకు పరిమితం చేశారు. విండీస్ జట్టు 5.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసిన సమయంలో వానతో మ్యాచ్ ను నిలిపివేసారు.

ఆ తర్వాత మ్యాచ్ ను కొనసాగించిన విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ వికెట్ నష్టపోయింది. గేల్ మొత్తం 31 బాల్స్ ఎదుర్కొని 4 పరుగుల స్కోరుకే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో దొరికిపోయాడు.

మరో ఓపెనర్ లూయిస్ మాత్రం దూకుడుగా ఆడి 36 బాల్స్ లో 2 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 40 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. వన్ డౌన్ హోప్ 11 బాల్స్ లో 6 పరుగులు సాధించిన సమయంలో మరోసారి వానదెబ్బ తగిలింది.

దీంతో మ్యాచ్ ను 34 ఓవర్లకు కుదించి కొనసాగించాలని నిర్ణయించినా ప్రయోజనం లేకపోయింది. గంటన్నర పాటు కురిసిన భారీవర్షంతో మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు.

సిరీస్ లోని రెండో వన్డే ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ స్టేడియం వేదికగా ఆదివారం జరుగుతుంది.

First Published:  8 Aug 2019 10:00 PM GMT
Next Story