Telugu Global
NEWS

66:34 వాటాతో రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలు

కృష్ణా నది జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పష్టమైన సూచనలు చేసింది. శుక్రవారం తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో బోర్డు చైర్మన్ గుప్తా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్‌ నియంత్రణపై సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ సాగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వేసవిలో సాగర్‌ నుంచి నీరు విడుదల కాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగర్‌ను […]

66:34 వాటాతో రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలు
X

కృష్ణా నది జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పష్టమైన సూచనలు చేసింది. శుక్రవారం తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో బోర్డు చైర్మన్ గుప్తా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్‌ నియంత్రణపై సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ సాగింది.

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వేసవిలో సాగర్‌ నుంచి నీరు విడుదల కాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగర్‌ను తెలంగాణ అధికారులు నియంత్రించే ప్రయత్నం చేశారన్నారు.

ఇందుకు స్పందించిన తెలంగాణ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ నియంత్రణలో, నాగార్జున సాగర్‌ తెలంగాణ నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. అయితే ప్రాజెక్టులు ఎవరి నియంత్రణలో కాకుండా మేనేజ్‌మెంట్ బోర్డు ఆధీనంలో ఉంటాయని ఏపీ అధికారులు వివరించారు.

ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రుల నిర్ణయమే ఫైనల్ అని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉందామని ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయానికి వచ్చారు.

సమావేశంలో కృష్ణా నీటిని ఏ రాష్ట్రం ఏ మేరకు వాడుకోవాలన్న దానిపై బోర్డు చైర్మన్ గుప్తా ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే కృష్ణా నది నీటిలో 66 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్‌కు, 34 శాతం నీటిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఆమేరకు ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకోవాలని ఆదేశించారు.

First Published:  9 Aug 2019 10:27 PM GMT
Next Story