Telugu Global
NEWS

రివర్స్ ఎఫెక్ట్‌... 8శాతం డిస్కౌంట్‌కు కంపెనీ సిద్ధం

ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమవడంతో అప్పుడే దాని ప్రభావం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ఇప్పటికే నవయుగ కంపెనీని, బెకమ్ సంస్థలతో ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు నవయుగ సంస్థ స్పందించింది. తమ అకౌంట్‌ను సెటిల్ చేయాల్సిందిగా నవయుగ కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో పోలవరం గేట్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న బెకమ్ సంస్థ మాత్రం మరోలా స్పందించింది. గేట్ల తయారీకి తమనే కొనసాగించాలని […]

రివర్స్ ఎఫెక్ట్‌... 8శాతం డిస్కౌంట్‌కు కంపెనీ సిద్ధం
X

ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమవడంతో అప్పుడే దాని ప్రభావం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ఇప్పటికే నవయుగ కంపెనీని, బెకమ్ సంస్థలతో ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకుంది.

ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు నవయుగ సంస్థ స్పందించింది. తమ అకౌంట్‌ను సెటిల్ చేయాల్సిందిగా నవయుగ కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో పోలవరం గేట్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న బెకమ్ సంస్థ మాత్రం మరోలా స్పందించింది.

గేట్ల తయారీకి తమనే కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. అలా అవకాశం ఇస్తే మిగిలిన పనుల్లో 8 శాతం మేర డిస్కౌంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ఆఫర్ చేసింది.

అయితే ఈ పనులను కూడా గత ప్రభుత్వం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్దతిలో ఇచ్చినందున బెకమ్ సంస్థ ప్రతిపాదనకు నేరుగా ఆమోదం తెలపలేమని అధికారులు చెబుతున్నారు.

రివర్స్ టెండరింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం బెకమ్ సంస్థకూ ఉంటుందని… ఆ సమయంలో తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచితే పరిశీలన చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పోలవరం ఒప్పందాల రద్దుపై ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు ఆయా సంస్థల నుంచి సమాధానం వచ్చిన నేపథ్యంలో రివర్స్ టెండరింగ్‌ పక్రియకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నారు.

నాలుగైదు రోజుల్లో డాక్యుమెంట్లను సిద్ధం చేసే పక్రియ పూర్తవుతుందని… ఆ వెంటనే పోలవరం నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ కు పిలుస్తామని ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.

First Published:  9 Aug 2019 11:08 PM GMT
Next Story