మహేంద్రసింగ్ ధోనీ గ్యారేజ్ లో సరికొత్త కారు

  • కాశ్మీర్ లోయ సైనిక విధుల్లో ధోనీ
  • కోట్ల ఖరీదైన కార్లు, బైక్ ల యజమాని ధోనీ

భారత సైనికదళాలకు చెందిన ప్యారాచ్యూట్ రెజిమెంట్ తరపున…కాశ్మీర్ లోయలో ఓ సైనికుడుగా గస్తీ విధులు నిర్వర్తిస్తున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కోసం.. బ్రాండ్ న్యూ కార్ ఎదురుచూస్తోంది.

గత 14 సంవత్సరాలుగా భారత స్టార్ క్రికెటర్ గా వందల కోట్ల రూపాయలు ఆర్జించిన ధోనీకి ఖరీదైన మోటార్ బైక్ లు, విలాసవంతమైన కార్లు సేకరించడం అంటే చెప్పలేని మక్కువ.

 ఇప్పటికే ధోనీ..తాను సేకరించిన కార్లు, బైక్ ల కోసం సొంతంగా అతిపెద్ద గ్యారేజ్ ను ఏర్పాటు చేసుకొన్నాడు.

ధోనీ గ్యారేజ్ లో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్ -2, జీఎంసీ సియారా, సేకరించిన టూవీలర్లలో కవాసకీ నింజా హెచ్ -2, కాన్ఫెడరేట్ హెల్ క్యాట్, బీఎస్ ఏ, సుజికీ హయాబుషా, నోర్టాన్ వింటేజ్ లాంటి అరుదైన బ్రాండ్లు డజన్లు కొద్దీ ఉన్నాయి.

తాను సేకరించిన ఖరీదైన బైక్ లు, విలాసవంతమైన కార్లను అబ్బురంగా చూసుకొని మురిసిపోడం ధోనీకి ఓ హాబీగా మారిపోయింది.

ప్రస్తుతం సైనిక విధులు నిర్వహిస్తున్న ధోనీ గతంలోనే జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్ అనే మధ్యతరగతి ఎస్ యూవీని బుక్ చేశాడు.

భారత్ లోనే అత్యంత ఖరీదైన, ఈ ఏకైక కారు…. ధోనీ గ్యారెజ్ లో రిజిష్ట్ర్రేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సాక్షీ ధోనీ ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రకటించింది. 

ధోనీ సైనిక విధులు ఆగస్టు 15తో ముగియనున్న సంగతి తెలిసిందే.