Telugu Global
NEWS

నాతో ఉంటే దేశ భక్తుడివి.... లేకుంటే దేశ ద్రోహివి

దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు కేటీఆర్. విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదన్నారు ఆయన. తెలంగాణలో తరతరాలుగా మతభేదం లేకుండా జీవనం సాగుతోందన్నారు. మాతో ఉంటే దేశభక్తుడివి… లేకపోతే దేశద్రోహివి అన్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గాడ్సే దేశభక్తుడని… సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను సోషల్ మీడియా వేదికగా ఖండించానన్నారు. గాడ్సేను దేశభక్తుడంటూ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ వ్యాఖ్యానాలు కూడా రావడం బాధ కలిగించిందన్నారు. […]

నాతో ఉంటే దేశ భక్తుడివి.... లేకుంటే దేశ ద్రోహివి
X

దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు కేటీఆర్. విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదన్నారు ఆయన. తెలంగాణలో తరతరాలుగా మతభేదం లేకుండా జీవనం సాగుతోందన్నారు. మాతో ఉంటే దేశభక్తుడివి… లేకపోతే దేశద్రోహివి అన్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

గాడ్సే దేశభక్తుడని… సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను తాను సోషల్ మీడియా వేదికగా ఖండించానన్నారు. గాడ్సేను దేశభక్తుడంటూ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ వ్యాఖ్యానాలు కూడా రావడం బాధ కలిగించిందన్నారు. జాతిపితను గౌరవించుకోలేని జాతి మనది అని బాధేసిందన్నారు. దేశంలో మతం, జాతీయ వాదం పెనవేసుకుని పోయాయన్నారు.

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభలకు హాజరైన కేటీఆర్‌… సమావేశానికి వచ్చిన వారు నిర్భయంగా వారి వారి అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. ఇది హైదరాబాద్‌ అని ఇక్కడ అందరికీ స్వేచ్చ ఉంటుందని వ్యాఖ్యానించారు. మతానికి భాష ఉంటుంది గానీ… భాషకు మతం ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ చాలా సార్లు చెప్పే వారని గుర్తు చేసుకున్నారు.

పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జయశంకర్, కేసీఆర్‌ లాంటి నేతలు తెలుగుతో పాటు ఉర్దూలోనూ మాట్లాడేగలిగేవారన్నారు. దేశంలో ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం కష్టమని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని తాము కోరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. మతోన్మాదం పెచ్చరిల్లితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

First Published:  10 Aug 2019 11:54 AM GMT
Next Story