పుట్టిన రోజు…. కాశ్మీర్ లో మహేష్ ఇలా….!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఆసక్తికర చిత్రం సరిలేరు నీకెవ్వరు కి సంబందించిన షూటింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విషయం  తెలిసిన విషయమే.

అయితే నిన్న మహేష్ బాబు జన్మదినం సందర్భం గా ఈ సినిమా యూనిట్ ఒక స్పెషల్ ఇంట్రో టీజర్ ని విడుదల చేశారు. ఆ ఇంట్రో టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది పక్కన పెడితే, మహేష్ బాబు కి ఎలాగైనా మహర్షి కి మించిన విజయన్ని ఇవ్వాలని అనిల్ సిద్ధం అవుతున్నాడు.

అయితే మహేష్ బాబు అభిమానులకి మహేష్ బాబు పుట్టిన రోజు మరింత సంతోషం కలిగించేలా అనిల్ ఒక వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తే, ఇందులో మహేష్ బాబు క్రికెట్ ఆడుతూ కనిపించారు.

అనిల్ రావిపూడి, మెహెర్ రమేష్ మరియు వంశీ పైడిపల్లి తో కలిసి సరదా గా షూటింగ్ అయిపోయాక కాశ్మీర్ లో మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో అది. ఈ వీడియో లో గౌతమ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.