మన్మథుడు-2 మొదటి రోజు వసూళ్లు

మన్మథుడు2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితేనేం మొదటి రోజు వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. మూవీకి భారీగా ప్రమోషన్ ఇవ్వడం ఒకెత్తయితే.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడం మరో ఎత్తు. అలా మొదటి రోజు మన్మథుడు-2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అచ్చంగా 3 కోట్ల 80లక్షల రూపాయల షేర్ వచ్చింది.

మొదటి రోజు వసూళ్లు బాగున్నప్పటికీ, మూవీ రికవర్ అవ్వడం కష్టమంటోంది ట్రేడ్. మొదటి రోజే ఈ సినిమాక అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో పాటు శని, ఆదివారాలు అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 16 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా మరో 12 కోట్లు రావాలి. ఫ్లాప్ టాక్ తో ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.30 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 0.46 కోట్లు
ఈస్ట్ -రూ. 0.35 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
కృష్ణా – రూ. 0.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు