ఇక అందమైన కశ్మీర్ అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకుందాం – సీఎం

ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌ అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు మార్గం సుగమమైందన్నారు.

ఇప్పటి వరకు బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునే వారిమని… చాలా మంత్రులు కూడా బీహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకున్నారని ఇకపై ఆ ఇబ్బంది లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినందున ఇకపై కశ్మీర్‌ నుంచి అందమైన అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారన్నారు. మోడీ తెచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వల్ల హర్యానాలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందన్నారు ముఖ్యమంత్రి.